News October 8, 2024
వాలంటీర్లపై ఎల్లుండి కీలక నిర్ణయం?

AP: గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్‌లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News February 5, 2026
WPL Final: ఢిల్లీ భారీ స్కోరు

WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ జెమీమా(57), లారా (44), లిజెల్లీ లీ(37) రాణించారు. చివర్లో చినెల్లీ హెన్రీ(35*) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. సయాలి, అరుంధతి రెడ్డి, డి క్లెర్క్ తలో వికెట్ తీశారు. బెంగళూరు టార్గెట్ 204.
News February 5, 2026
ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు: తండ్రి

కొందరు అమ్మాయిలు కొరియన్ కల్చర్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. ఘజియాబాద్‌లో <<19055978>>ముగ్గురు<<>> అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణం కొరియన్ గేమ్స్ ఆడనివ్వకపోవడమే. ‘నా కూతుళ్లు కొరియాకు తీసుకెళ్లమని అడిగేవారు. మనం ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు. ఒరిజినల్ పేర్లను అలిజా, సిండీ, మారియాగా మార్చేసుకున్నారు’ అని తండ్రి చెప్పారు. దీంతో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. Comment?
News February 5, 2026
VASTHU: అలాంటి ఇల్లు ఆలయంతో సమానం!

క్రమశిక్షణతో కూడిన భక్తి ఉన్న ఇల్లు ఆలయంతో సమానమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అన్నారు. అచంచలమైన నమ్మకంతో ఇంటి పూజా మందిరంలో కొలువైన దేవతలను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నారు. ‘ఆగమశాస్త్రయుక్తంగా ప్రాణప్రతిష్ట జరిగిన గుడిలోని మూర్తుల నుంచి శక్తి తరంగాలు వెలువడతాయి. ఇంట్లో వాస్తు రీత్యా దైవపటాలను ఉంచి భక్తితో పూజించినప్పుడు, ఆ ఏకాగ్రతే అక్కడ సాత్విక శక్తిని నింపుతుంది’ అని చెప్పారు. <<-se>>#VASTHU<<>>


