News September 25, 2024
డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన ఎలాన్ మస్క్

ఇటలీ ప్రధాని మెలోనితో డేటింగ్ చేయడం లేదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ ప్రోగ్రాంలో ‘మెలోని బయట కంటే లోపల మరింత అందమైన వ్యక్తి’ అని మస్క్ ప్రశంసించారు. దీంతో వీరి డేటింగ్ ప్రచారం మొదలైంది. వీరిద్దరి ఫొటోను షేర్ చేసిన మస్క్ ఫ్యాన్ క్లబ్ ‘వీళ్లు డేట్ చేస్తారని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించింది. దీనికి ‘మేము డేటింగ్ చేయడం లేదు’ అని మస్క్ రిప్లై ఇచ్చారు.
Similar News
News February 4, 2026
చిరంజీవి ‘వారసుడు’ కామెంట్లపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లావణ్య

రామ్‌చరణ్‌కు కవలలు పుట్టడంతో చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ కామెంట్లపై పలువురు SMలో విమర్శలు చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ‘మీ పోస్ట్ అభ్యంతరకరంగా, ఆనందకరమైన క్షణాలను తుడిచిపెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు, మనవరాళ్లతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసేదాంట్లో చాలామంది 1% కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు’ అని హితవు పలికారు.
News February 4, 2026
ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 4, 2026
ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసా?

కొన్ని కంపెనీలు కావాలనే లేని జాబ్ ఆఫర్స్‌ను జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటినే ఘోస్ట్ జాబ్స్ అంటారు. వీటికి అప్లై చేసుకుంటే స్పందన కోసం నెలల కొద్దీ వేచి చూడాలి. కంపెనీ యాక్టివ్‌గా ఉందని, గ్రో అవుతోందని ఇన్వెస్టర్లకు, క్లయింట్లకు చూపించడానికి, అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో కంపెనీలు, ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.


