News December 1, 2024
OpenAIపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్

OpenAI అనైతిక వ్యాపార విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ సంస్థ CEO, Microsoftపై ఎలాన్ మస్క్ కోర్టుకెక్కారు. AI ఫలాలు ప్రజలకు దక్కాలనే అసలు లక్ష్యం నుంచి పక్కకు తప్పుకొని OpenAI లాభాల కోసం పనిచేసే సంస్థగా మారకుండా నిలువరించాలని కోరారు. ప్రత్యర్థి సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా ఇన్వెస్టర్లను OpenAI అడ్డుకుంటోందని, మైక్రోసాఫ్ట్‌తో రహస్య సమాచారాన్ని పంచుకుంటోందని ఆరోపించారు.
Similar News
News October 28, 2025
అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.
News October 28, 2025
LRS గడువు పొడిగింపు

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 28, 2025
PKL: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో ఇవాళ తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్ మధ్య ఎలిమినేటర్-3 మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేపు క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. కాగా నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పుణెరి పల్టాన్‌పై గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్లోనైనా విజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


