News February 7, 2025

ELR: అందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నారు. సంబంధిత వాల్ పోస్టర్లను డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.DMHO ఆర్.మాలతి మాట్లాడుతూ.. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల లోపు ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీటిని తీసుకుంటే నులిపురుగులు రావని చెప్పారు.

Similar News

News February 9, 2026

ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: APC మమ్మీ

image

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష APC మమ్మీ సోమవారం కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించారని చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. నివాస ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి మార్చి10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.

News February 9, 2026

నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

image

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News February 9, 2026

నరదిష్టి నివారణ పూజ

image

విజయప్రాప్తి, సకల శుభాలు కలగాలంటే నరదిష్టి నివారణ పూజ ఎంతో ప్రయోజనకరం. ఈ పూజతో ఇతరుల అసూయ, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ శాస్త్రోక్త పూజతో అనారోగ్యాలు తొలగి, మానసిక శాంతి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ రక్షణ చేకూరుతాయి. మీ పేరు, గోత్రంతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డ్‌ను మీ వాట్సాప్‌కు పంపిస్తాము. ఆటంకాలను తొలగించుకోవడానికి వేదమందిర్‌లో ఇప్పుడే పూజ <>బుక్ చేసుకోండి.<<>>