News January 28, 2025
ELR: పోలీసులమంటూ రూ.20 లక్షలు కొట్టేశారు..!

ఓ రిటైర్డ్ ఉద్యోగినే మోసం చేసిన వైనం ఇది. వట్లూరుకు చెందిన మైన్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ డీడీ రంగారావు(67)కు ఈనెల 21న బెంగళూరు వ్యక్తి ఫోన్ చేశాడు. ‘ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. అతని వెనుక మీరున్నట్లు తేలింది. ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.20లక్షలు ఇవ్వండి’ అని చెప్పడంతో రంగారావు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో బాధితుడు ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.
News November 28, 2025
గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


