News April 4, 2024

మా జట్టు ఆట చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్

image

నిన్న KKRతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా జట్టు తొలి అర్ధభాగం ఆట చూసి సిగ్గుపడ్డాను. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి 2 గంటల టైమ్ పట్టింది. 2 ఓవర్లు వెనుకబడటంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేం చాలా పొరపాట్లు చేశాం. ఇవి ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

image

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.

News November 8, 2025

పెసర, మినుము పంటల్లో విత్తనశుద్ధికి సూచనలు

image

పెసర, మినుములో చీడపీడల నివారణకు విత్తనశుద్ధి కీలకం. అందుకే విత్తడానికి ముందు ఒక కిలో విత్తనానికి 3గ్రా. మ్యాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసి తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. చివరగా విత్తే ముందు ఎకరానికి 200గ్రా. రైజోబియం కల్చర్‌ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

News November 8, 2025

నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

image

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?