News October 17, 2024

‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది: కంగన

image

తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

Similar News

News October 17, 2024

ఇన్నాళ్లూ న్యాయదేవత కళ్లకు గంతలెందుకు?

image

చట్టం అందరికీ సమానమనే సందేశం చాటేందుకు న్యాయదేవత కళ్లకు గంతలుండేవి. హోదా, అధికారం, అంగ/అర్థ బలం, బంధుత్వం వంటివి చూడకుండా, వాస్తవాలు, చట్టానికి లోబడే తీర్పులు ఉంటాయని దీని అర్థం. బ్రిటిషర్ల కాలం నుంచి మన దేశంలో కళ్లకు గంతలు కట్టిన న్యాయ దేవత విగ్రహం కొనసాగుతోంది. చాలాసార్లు ‘చట్టానికి కళ్లు లేవు/ చట్టం కళ్లు మూసుకుంది/ న్యాయ దేవత కళ్లు కప్పేశారు’లాంటి కామెంట్లను సినిమాలు, విమర్శకుల నుంచి విన్నాం.

News October 17, 2024

థాంక్యూ పవన్ కళ్యాణ్: పన్నీర్ సెల్వం

image

AIADMK వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ వరస ట్వీట్లలో ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ విషెస్‌పై ఆ పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం స్పందించారు. ‘డియర్ పవన్ కళ్యాణ్, AIADMK 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీరు విష్ చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో విభేదాల నేపథ్యంలో పవన్ AIADMKకి విషెస్ చెప్పడం ఆసక్తికరం.

News October 17, 2024

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతం!

image

హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ చీఫ్ యాహ్య సిన్వర్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. గాజాలో ఆ దేశ మిలిటరీ ముగ్గురిని హతమార్చింది. ఇందులో సిన్వర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తోంది. అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉందని IDF తెలిపింది. గతేడాది OCT 7న ఇజ్రాయెల్‌పై తొలిసారి దాడిలో మాస్టర్ మైండ్‌ సిన్వర్‌దే. సిన్వర్ కంటే ముందు హమాస్ చీఫ్ హనియాను కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది.