News August 17, 2024
సాయంత్రం కర్ణాటక క్యాబినెట్ అత్యవసర భేటీ

ముడా భూకుంభకోణంలో తనపై <<13875697>>విచారణకు<<>> గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక CM సిద్దరామయ్య అత్యవసర క్యాబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. సాయంత్రం మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. భూకుంభకోణం విచారణపై చర్చించనున్నారు. అటు కర్ణాటకలో పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు పయనమయ్యారు. సిద్దరామయ్యకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఆరా తీశారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.
News December 5, 2025
కష్టాలకు తలొగ్గవద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్

TG: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం KCR సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. BRS అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.


