News September 26, 2024
ఆ సీన్స్ కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’ రిలీజ్: సెన్సార్ బోర్డ్

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను తాము సూచించిన 11 మార్పులు చేస్తేనే విడుదల సాధ్యమని బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. Sept 6న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సిక్కుల అభ్యంతరాలతో నిలిచిపోయింది. తమ వర్గాన్ని తప్పుగా చూపించారని వారు నిరసన వ్యక్తం చేశారు. కాగా నిర్మాణ సంస్థ పిటిషన్పై తాజాగా సెన్సార్ బోర్డు ఇలా స్పందించింది. విచారణను హైకోర్టు Sept 30కి వాయిదా వేసింది.
Similar News
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.
News November 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 7, 2025
బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.


