News June 25, 2024
సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ విడుదల

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.
Similar News
News January 6, 2026
KMR: ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ మహిళా మైనారిటీ యువజన పథకం’ కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ కోరారు. జిల్లాలోని పేద ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


