News August 12, 2024

ఈనెల 14న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

image

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ ఈనెల 14న విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించనుండగా మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది.

Similar News

News January 9, 2026

ఒక్కటవనున్న NCP? అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..!

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు NCP వర్గాలు మళ్లీ కలవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. పవార్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఇప్పుడు సర్దుకున్నాయని అన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. NCP ఫౌండర్ శరద్ పవార్‌తో గ్యాప్ తగ్గినట్లు అజిత్ మాటలను బట్టి అర్థమవుతోంది.

News January 9, 2026

భారత్‌కు వెనిజులా నుంచి క్రూడాయిల్?

image

రష్యా క్రూడాయిల్ కొనకుండా భారత్‌పై టారిఫ్స్‌తో అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కంట్రోల్‌లోని వెనిజులా చమురును ఇండియాకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెనిజులా ఆయిల్‌ను గ్లోబల్‌గా మార్కెట్ చేయాలని US యత్నిస్తోంది. ఇండియాకు అమ్మేందుకూ సిద్ధంగా ఉంది’ అని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కాగా 50M బ్యారెళ్ల ఆయిల్‌ను వెనిజులా తమకు <<18798755>>అందజేస్తుందని<<>> ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.

News January 9, 2026

DGPకి హైకోర్టులో ఊరట

image

TG: DGP శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో DGP పూర్తిస్థాయి నియామకం జరగాలని UPSC సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.