News July 30, 2024
షారుఖ్కు అత్యవసర చికిత్స.. USకు పయనం?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. 2014లో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఆ సమస్య తిరగబెట్టడంతో ఆయన నిన్న ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ ట్రీట్మెంట్ లోపం కారణంగా సమస్య పెద్దది కావడంతో వెంటనే US వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
Similar News
News October 23, 2025
నిద్రను వీడే సమయం బట్టే మానవ ఆయుర్దాయం

రాత్రి చివరి భాగానికి ఉషస్సు అని పేరు. మానవులందరూ ఉషఃకాలంలోనే నిద్రలేవాలి. స్నానానంతరం పరమేశ్వరుని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గురించి, ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి. నిదుర లేచే సమయాన్ని, పద్ధతిని బట్టే మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని శ్రీ శివ మహాపురాణం చెబుతోంది.
<<-se>>#SIVOHAM<<>>
News October 23, 2025
‘హలాల్’ లాభాలతో లవ్ జిహాద్, టెర్రరిజం: యోగి

‘హలాల్’పై UP సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హలాల్ చేసిన వస్తువుల విక్రయంతో వచ్చిన లాభాలతో లవ్ జిహాద్, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. సర్టిఫికేషన్ పేరుతో ₹25వేల కోట్లు దుర్వినియోగం చేశారు. అందుకే హలాల్ వస్తువులను నిషేధించాం’ అని అన్నారు. ఇస్లామిక్ చట్టానికి లోబడి తయారు చేసేవాటికి హలాల్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ ఆరోపణలతో సమస్యలను CM తప్పుదోవపట్టిస్తున్నారని ప్రతిపక్షాలంటున్నాయి.
News October 23, 2025
తేనెతో జుట్టుకు పోషణ

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.