News July 12, 2024
చీకటి అధ్యాయంగా ‘ఎమర్జెన్సీ’ గుర్తుండిపోతుంది: మోదీ

కాంగ్రెస్ ‘ఎమర్జెన్సీ’ నిర్ణయాన్ని యావత్ దేశం ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్’గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ‘ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాసి తర్వాత దేశం ఎదుర్కొన్న పరిస్థితులను ఈరోజు గుర్తుకుతెస్తుంది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతివ్యక్తికి నివాళులర్పించే రోజు జూన్ 25’ అని ఆయన రాసుకొచ్చారు.
Similar News
News November 17, 2025
భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్‌లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్‌లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.