News August 19, 2024

ఎంపాక్స్: కేంద్రం అలర్ట్

image

ప్రపంచ వ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్‌గా ఉండాలని అధికారులకు కేంద్రం సూచించింది. ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రుల్లో చేరేవారిని పరీక్షించి, అనుమానితులకు RT-PCR టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. ఇటు TGలో నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర అధికారులకు సూచించారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 20, 2025

బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.

News November 20, 2025

ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

image

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 20, 2025

ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

image

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.