News September 24, 2025

అమరావతి మునిగిపోయిందని పోస్టు చేసిన ఉద్యోగి సస్పెండ్

image

AP: అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం’ అని AUG 19న పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పోస్టులు వ్యక్తిగతం కావని, ప్రజలను ప్రభావితం చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Similar News

News September 24, 2025

మండలానికి ఒక జూనియర్ కాలేజీ: లోకేశ్

image

AP: మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ‘గత సర్కారు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసింది. హైస్కూల్ ప్లస్ విధానంతో కాలేజీల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా పోయారు. మేము ఆ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కాలేజీల్లో 40% అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం’ అని చెప్పారు.

News September 24, 2025

UCILలో 95 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL)లో 95 ఖాళీలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరు. ఇందులో డిప్లొమా ట్రైనీ 62, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ 20, మేనేజ్‌మెంట్ ట్రైనీ 13 పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి బీటెక్, డిగ్రీ/డిప్లొమా పూర్తయిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.ucil.gov.in/<<>>

News September 24, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: పొన్నం

image

TG: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కంటోన్మెంట్‌(ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు)లో జరిగిందే జూబ్లీహిల్స్‌లోనూ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. BRS ఇంకా అపోహల్లోనే బతుకుతోందని, ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొన్నం వెల్లడించారు.