News November 15, 2024
మీలాంటి బాస్‌ల వల్లే ఉద్యోగులు చస్తున్నారు: నారాయణ మూర్తిపై నెటిజన్ల ఫైర్

భారత్‌లో వారానికి 5 రోజుల పని విధానం నిరాశపరిచిందని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను తాను నమ్మనని పేర్కొన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయనలాంటి వారివల్లే వర్క్ ప్లేసెస్ టాక్సిక్ అవుతున్నాయని అంటున్నారు. ఈవై కంపెనీలో వీకాఫ్ లేకుండా కొన్నినెలలు రోజుకు 14 గంటలు పనిచేస్తూ ఉద్యోగి మరణించడాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి చావులకు ఇలాంటి బాస్‌లే కారణం అంటున్నారు. మీ కామెంట్.
Similar News
News February 15, 2026
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.
News February 15, 2026
హీరో నిఖిల్ వివాదాస్పద పోస్ట్.. ఎవరి గురించి?

హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా నుంచి ఇటీవల ఎపిక్ టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ సమస్య వల్ల ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘యూట్యూబ్ భయ్యా ఎందుకిలా టెక్నికల్ గ్లిచ్ వచ్చేలా చేశావ్.. ఇటీవల రిలీజైన సినిమాల్లాగా మా మూవీలో AI యూజ్ చేయలేదు’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఎవరిని, ఏ సినిమాను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.
News February 15, 2026
ఎర్రకోట పేలుళ్లు.. వెలుగులోకి ‘అన్సార్ ఇంటెరిమ్’

ఢిల్లీ ఎర్రకోట <<19117415>>పేలుళ్ల కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టయిన ఉగ్రడాక్టర్లంతా ‘అన్సార్ ఇంటెరిమ్’ పేరుతో టెర్రరిస్టు గ్రూపును ఏర్పాటు చేసినట్లు NIA వర్గాలు వెల్లడించాయి. ‘గన్నీ, ఉమర్, ఆదిల్, ముజుఫర్, ఆమిర్, తౌఫిల్ శ్రీనగర్‌లో సమావేశమై దాడులకు ప్లాన్ చేశారు. 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్‌ను కొన్నారు. ఆన్‌లైన్‌లో IEDల తయారీ నేర్చుకున్నారు’ అని తేలింది.


