News July 22, 2024

ఉద్యోగులు, ఎకానమీని దెబ్బకొడుతున్న భూతాలివే

image

సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్, శ్రమలేని అలవాట్లు, అనారోగ్యకర ఆహారం తాలూకు మిశ్రమ ప్రభావం ఉద్యోగులపై ఎక్కువగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది ప్రజారోగ్యమే కాకుండా దేశ ఆర్థిక సామర్థ్యాన్నీ దెబ్బతీస్తోందని విచారం వ్యక్తం చేసింది. శరీరం, పర్యావరణానికి మేలుచేసే భారతీయ అలవాట్లు, ఆహారాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలంది. ఉద్యోగులు అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన వంటకాలు ఎక్కువ తింటున్నారని సర్వేలో పేర్కొంది.

Similar News

News January 25, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

News January 25, 2025

జగన్ CM కావడానికి VSR పనిచేశారు: కాకాణి

image

AP: జగన్ CM కావడానికి <<15247358>>విజయసాయిరెడ్డి<<>> పని చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ‘పార్టీ కోసం పాటుపడ్డారు. కుట్రలు, దుష్ప్రచారం చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది’ అని కాకాణి చెప్పారు. మరోవైపు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలను ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి ఖండించారు. దావోస్ పర్యటన నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతానన్నారు.