News August 23, 2025
ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి: బొప్పరాజు

AP: ఉద్యోగులకు సంబంధించి ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి. 3 నెలల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Similar News
News August 23, 2025
పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా

AP: మున్సిపల్ కార్మికుల భద్రతకు సీఎం చంద్రబాబు కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ-యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నాయి. శాశ్వత ఉద్యోగులకు రూ.1 కోటి వరకు ప్రమాద బీమా, రూ.10 లక్షల లైఫ్ కవర్, అవుట్ సోర్సింగ్ వారికి రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ ఉంటుంది. తక్కువ ప్రీమియంతో కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
News August 23, 2025
‘ఓట్ చోరీ’పై ప్రజల్లోకి కాంగ్రెస్

TG: రాహుల్ గాంధీకి మద్దతుగా ‘ఓట్ చోరీ’ అంశంపై రాష్ట్రంలోనూ విస్తృత ప్రచారం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పీఏసీ సమావేశంలో ప్రచార లోగోను ఆవిష్కరించారు. ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రిదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు.
News August 23, 2025
పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ నిర్ణయం

TG: స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన PAC సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. SEP 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని HC గడువు విధించడంతో ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేసే అవకాశముంది.