News October 11, 2024
IR ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్

AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.
Similar News
News November 18, 2025
టుడే టాప్ స్టోరీస్

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష

సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.