News November 19, 2024
ఉద్యోగులకు RSSతో అనుబంధం వద్దు.. తిరిగి నిషేధించాలని రాష్ట్రపతికి వినతి

ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వెంట్లు RSS కార్యకలాపాల్లో పాల్గొనకుండా తిరిగి నిషేధం విధించాలని రాష్ట్రపతిని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వివక్ష లేని, నిష్పాక్షిక పాలనా వ్యవస్థను నిర్వహించేందుకు సివిల్ సర్వీసెస్లో రాజకీయ తటస్థ వైఖరిని కాపాడాలని పేర్కొన్నారు. రాజకీయ సంస్థలతో వీరి అనుబంధం పౌర సేవల్లో నిష్పక్షపాతానికి ప్రమాదమంటూ లేఖ రాశారు.
Similar News
News November 26, 2025
‘సఫ్రాన్’ ఏర్పాటుతో MSMEలకు వ్యాపార అవకాశాలు: సీఎం రేవంత్

TG: HYDలో ‘సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కొత్త సెంటర్ ప్రారంభోత్సవంలో CM రేవంత్ పాల్గొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ₹13K కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సెంటర్తో స్థానిక MSMEలకు, ఇంజినీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయన్నారు. బెంగళూరు-HYDను డిఫెన్స్& ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని PMకు విజ్ఞప్తి చేశారు.
News November 26, 2025
BREAKING: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు

AP: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. దీనికి ‘సెన్యూర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇది 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 26, 2025
అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

AP: విద్యార్థులు ప్రాథమిక హక్కులనే కాకుండా ప్రాథమిక బాధ్యతలనూ తెలుసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏదైనా అంశంపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 175 మంది స్టూడెంట్లతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను గౌరవించిన, అన్ని రంగాల్లో ప్రోత్సహించిన దేశమే అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.


