News September 2, 2025
CPS రద్దు చేయాలని ఉద్యోగుల పోరుబాట

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్, విజయవాడలో నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, CPS రద్దు చేస్తే సీఎం రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. అటు CPS రద్దు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఏపీ ఉద్యోగులు స్పష్టంచేశారు.
Similar News
News September 2, 2025
కడపలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేశ్

AP: దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సి.కె.దిన్నె MPP హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. కమలాపురం, జమ్మలమడుగు, కడపలో మరో 5 కిచెన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా 12 వేల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. డిసెంబర్ నాటికి కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు భోజనం అందిస్తామని లోకేశ్ ప్రకటించారు.
News September 2, 2025
వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్‌లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్‌ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్‌లిఫ్టింగ్ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్ హార్మోన్‌ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.
News September 2, 2025
ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్‌సెట్: https://icsil.in/