News October 7, 2025

ఉద్యోగులు దిక్కులేని వారయ్యారు: వెంకట్రామిరెడ్డి

image

AP: కూటమి ప్రభుత్వం 16 నెలలుగా ఉద్యోగులకు ఒక్క DA కూడా ఇవ్వలేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంటూ ఇవ్వడం లేదని, వారు దిక్కులేని వారు అయ్యారని అన్నారు. గతంలో సలహాదారులు ఉద్యోగుల సమస్యలు వినేవారని గుర్తు చేశారు. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనలకు, ఉపాధ్యాయుల ధర్నాలకు మద్దతిస్తున్నామని ప్రకటించారు.

Similar News

News March 18, 2026

పాకిస్థాన్‌కు అఫ్గాన్ క్రికెటర్ బిగ్ వార్నింగ్

image

కాబూల్‌ <<19403539>>ఆస్పత్రి<<>> ఘటనపై అఫ్గాన్ యంగ్ స్పిన్నర్ ఘజన్‌ఫర్ స్పందించారు. ‘దాడిలో గాయపడిన వారి వద్ద చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేవు. సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని అఫ్గాన్ సహించదు. ప్రతిఒక్కరికీ AFG చరిత్ర తెలుసు. అది రిపీటైతే PAKకు మంచిది కాదు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమకు భారత్ మిత్ర దేశమని, దాడుల గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ దేశాలు AFGకు మద్దతుగా నిలవాలని ఘజన్‌ఫర్ కోరారు.

News March 18, 2026

BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,57,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,44,600గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2026

గ్యాస్ కొరత: ఇన్‌స్టంట్ ఫుడ్ సేల్స్‌లో 20% జంప్

image

వంట గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఇన్‌స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీమేడ్ పులిహోర వంటి వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ సేల్స్ 20% పెరిగాయి. సూపర్ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఇన్‌స్టంట్ ఫుడ్ సెక్షన్లలో స్టాక్ వేగంగా ఖాళీ అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.