News June 13, 2024
చంద్రబాబుకి ఘన స్వాగతం పలకనున్న ఉద్యోగులు

AP: సచివాలయానికి వస్తున్న సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మందడం నుంచి సచివాలయం వరకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సచివాలయం రెండో బ్లాక్ నుంచి రెడ్ కార్పెట్ వేసి ఆయనను ఆహ్వానించనున్నారు. అంతకుముందు తిరుమల, ఇంద్రకీలాద్రిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. మరికాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు.
Similar News
News September 14, 2025
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CM

AP: తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త బస్ స్టేషన్లో 150 బస్సులు ఒకేసారి నిలిపేలా బస్బే ఉండాలని, లక్ష మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించాలని సూచించారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్దే: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయం హైకమాండ్ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో సమావేశమైన రేవంత్.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. బూత్ల వారీగా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
News September 14, 2025
రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.