News April 14, 2024

ఉద్యోగులకు ఐదో తేదీ లోపే జీతాలిస్తాం: పవన్

image

AP: వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెనాలి సభలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతాలు ఇస్తామన్నారు. జగన్‌కు అధికార గర్వం తలకెక్కిందని, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఈ గర్వం ఉన్నవారిని ప్రజలే వెంటపడి తరుముతారని హెచ్చరించారు.

Similar News

News March 29, 2026

KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

image

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.

News March 29, 2026

గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి మహీకా శర్మకు ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చారు. రూ.1.7కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌ను ప్రజెంట్ చేశారు. కారు వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. భార్య నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ మహీకతో రిలేషన్‌లో ఉన్నారు. కాగా ఇటీవల మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు రూ.4CR విలువైన ల్యాండ్‌రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

News March 29, 2026

GK: జీవశాస్త్రం విశేషాలు

image

☛ మానవ శరీరంలో అతి చిన్న ఎముక: స్టెపిస్ (చెవిలో ఉంటుంది)
☛ అతి పెద్ద ఎముక: ఫీమర్ (తొడ ఎముక)
☛ అతిపెద్ద అవయవం: చర్మం
☛ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?: హిస్టాలజీ
☛ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది: విలియం హార్వే (ENG)
☛ రక్తపోటును కొలిచే పరికరం: స్పిగ్మోమానోమీటర్
☛ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: O నెగటివ్