News November 17, 2024
సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో 75% ఆశావహుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఫేక్ రిక్రూటర్లను గుర్తించడంలో విఫలమై మోసగాళ్లకు నగదు చెల్లిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.

17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.