News October 22, 2024

ఇండియన్ ఎకానమీకి పెద్ద సవాల్ ‘ఉపాధి’: నిర్మల

image

భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఉపాధి కల్పన రూపంలో అతి పెద్ద సవాల్ ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. చాలామంది విద్యార్థులు యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లతో బయటికి వస్తున్నా, ఆ సర్టిఫికెట్లకు తమకు కావాల్సిన నైపుణ్యాలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు కంపెనీలు భావిస్తున్నాయని ఆమె అన్నారు. అందుకే యువతకు స్కిల్స్ నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని న్యూయార్క్‌లో అన్నారు.

Similar News

News December 9, 2025

KNR: ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి’

image

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ ప్రకృతి ప్రకాష్ నిర్మించిన “ఓటే భవితకు బాట” ఆడియో సీడీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానమైనదని, ప్రజల చేతిలో ఆయుధమని అన్నారు.

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.