News November 9, 2024
అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి: కేసీఆర్

TG: కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని కేసీఆర్ అన్నారు. ‘మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువ చేశాం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 24, 2025
గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో AP టాప్

AP: రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో జాతీయ స్థాయిలో రాష్ట్రం నంబర్.1 స్థానాన్ని సాధించింది. 2.82 లక్షల మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణ అందించి ఈ ఘనత సొంతం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విభాగంలో రాష్ట్రం 24వ స్థానంలో ఉండగా ఇప్పుడు అగ్రస్థానానికి చేరిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థలను ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
News December 24, 2025
BJP సర్పంచులున్న గ్రామాలకు బండి సంజయ్ వరాలు

TG: గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆందోళన అక్కర్లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లోని సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. ‘BJP సర్పంచులున్న గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు నిర్మిస్తాం. 9వ తరగతి చదువుతున్న పిల్లలకు ఫ్రీగా సైకిళ్లిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యానికి అత్యాధునిక పరికరాలు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.
News December 24, 2025
‘ఆరావళి’ పర్వతాలపై వివాదం ఎందుకంటే?

ఆరావళి పర్వతాల మైనింగ్పై <<18662201>>కేంద్రం<<>> వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. వీటిలో ‘100మీ. లేదా అంతకన్నా ఎత్తున్న వాటినే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు’ అని కేంద్రం చెప్పిన నిర్వచనాన్ని SC ఆమోదించింది. కానీ ఇప్పుడే కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే 91% పర్వతాలది 100 మీ. కంటే తక్కువ ఎత్తు అని, మైనింగ్ పేరుతో వాటిని తవ్వేయాలనే కేంద్రం ఇలా చేస్తోందని పర్యావరణవేత్తలు, ప్రజలు నిరసనలు తెలిపారు.


