News March 31, 2025
ఎంపురాన్@రూ.200 కోట్లు

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2:ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. 5 రోజులు పూర్తికాక ముందే రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది. ఈ నెల 27న మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
Similar News
News January 7, 2026
విద్యార్థి వీసాలపై అమెరికా తీవ్ర హెచ్చరికలు

విద్యార్థి వీసాలపై ఇండియాలోని అమెరికా ఎంబసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘స్టూడెంట్ వీసాదారులు US చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. చట్టాలను ఉల్లంఘించారని తేలినా, అరెస్టయినా వీసా రద్దవుతుంది. US నుంచి బహిష్కరిస్తారు. భవిష్యత్తులో వీసాలకు మీరు అనర్హులుగా మారవచ్చు. రూల్స్ పాటించండి. మీ ట్రావెల్‌ను ప్రమాదంలో పడేయకండి. US వీసా ఒక ప్రత్యేక ప్రయోజనం.. హక్కు కాదు’ అని ట్వీట్ చేసింది.
News January 7, 2026
సంక్రాంతి.. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు

TG: సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు TGSRTC ప్రకటించింది. 2003లో ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ ధరపై 1.5 రెట్ల వరకు సవరించామని పేర్కొంది. దీంతో రూ.100 ఉన్న టికెట్ రూ.150 కానుంది. TGతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకే ఇది వర్తించనుంది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC వివరించింది.
News January 7, 2026
మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.


