News March 24, 2024
OGలో ఇమ్రాన్ హష్మీ పిక్ రిలీజ్

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Similar News
News December 3, 2025
రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.
News December 3, 2025
ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.


