News April 2, 2024

ఎన్‌కౌంటర్‌: 9 మంది మావోయిస్టులు మృతి

image

ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కి చేరింది. గంగాలూరు పీఎస్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మరణించారు. తుపాకులతో పాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ వెపన్స్ సీజ్ చేశారు.

Similar News

News November 14, 2025

8 రోజులు క్రిస్మస్ సెలవులు!

image

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.

News November 14, 2025

WATER SCARCITY.. ఆరుతడి పంటలే వేయాలి: కృష్ణాడెల్టా CE

image

AP: 2026 మే వరకు సాగు, తాగు అవసరాలకు 228 TMCల నీరు అవసరమని కృష్ణాడెల్టా CE రాంబాబు తెలిపారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి వినియోగించినది పోగా AP వాటా ఇంకా 118 TMCలే ఉంది. పులిచింతలలోని 40 TMCలను కలిపితే మొత్తం 158TMCలు అందుబాటులో ఉంది. ప్రస్తుత అవసరాలను దీనితోనే తీర్చాలి’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు.

News November 14, 2025

యూఏఈపై భారత్-ఎ విజయం

image

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్‌కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్‌నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.