News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
Similar News
News January 2, 2026
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News January 2, 2026
బాలింతలు ఏం తినాలంటే?

ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు బాలింతకు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. కిచిడీ, పులగన్నం తీసుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గర్భాశయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.


