News April 30, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు హతం

image

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్ జరిపాయి. ఈక్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇటీవలే కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 20, 2026

IPL ఆరంభ మ్యాచ్‌లకు స్టార్క్ దూరం

image

మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ పేసర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ₹11.75 కోట్లకు సొంతం చేసుకుంది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్ చేయడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్టార్క్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆసిస్ ప్లేయర్లలో కమిన్స్, హేజిల్‌వుడ్ సైతం కొన్ని IPL మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికే వైదొలిగారు.

News March 20, 2026

30 ఏళ్లు దాటాయా.. చర్మ సౌందర్యానికి చిట్కాలు

image

వయసు 30 ఏళ్లు దాటాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌, ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.

News March 20, 2026

బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే..

image

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీలో తల్లి శార్డైన్స్, గుమ్మడి గింజలు, పాలకూర, బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు, బ్రెజిల్ నట్స్, పల్లీలు, అవకాడో,గ్రీక్ యోగర్ట్ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, అయోడిన్ పిల్లల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుందంటున్నారు.