News March 27, 2024
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా చికుర్‌బట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతాబలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Similar News
News January 29, 2026
VZM: ఉమ్మడి జిల్లాలో బార్లకు రీ-నోటిఫికేషన్

ప్రభుత్వం బార్లకు రీ-నోటిఫికేషన్ బుధవారం జారీ చేసింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో 8 బార్లు, బొబ్బిలిలో 1 బార్, రాజాంలో 2 బార్లు కేటాయించారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురంలో 3 బార్లు, సాలూరులో 1 బార్‌కు అనుమతి ఇచ్చారు. దరఖాస్తులు ఫిబ్రవరి 4 వరకు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5న లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు.
News January 29, 2026
చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
News January 29, 2026
ఒట్రోవర్ట్ గురించి తెలుసా?

ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఆంబ్రివర్ట్ అనే పదాలు వ్యక్తిత్వాన్ని సూచించేందుకు వాడతారు. అయితే ఒట్రోవర్ట్ లక్షణాలున్నవారు ఇంట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్స్ కలిపి పరిస్థితులకు తగ్గట్లు మారిపోతూ ఉంటారు. వీరు ప్రత్యేకమైన సంబంధ శైలిని కలిగి ఉంటారంటున్నారు నిపుణులు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ మధ్య స్పష్టమైన మూడ్ స్వింగ్‌లను అనుభవించే వ్యక్తులను వివరించడానికి ఒట్రోవర్ట్ పదాన్ని ఉపయోగిస్తున్నారు.


