News May 14, 2024

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్, ముగ్గురు మావోయిస్టుల హతం

image

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు కమాండోలు హతమయ్యారని పోలీసులు ప్రకటించారు. వారిలో ఇద్దరు మహిళలున్నారని, ఒక్కొక్కరిపై రూ.22 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. కాట్రంగట్ట గ్రామం వద్ద మావోయిస్టులున్నారన్న సమాచారం మేరకు జల్లెడ పట్టామని, ఈక్రమంలోనే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News March 17, 2026

ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

image

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్‌ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

News March 17, 2026

ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

image

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.

News March 17, 2026

క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.