News August 14, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

image

జమ్మూకశ్మీర్ దోడాలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు వీరమరణం పొందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు!

image

TG: రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది. ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్‌స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 8, 2025

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.

News November 8, 2025

4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.