News April 23, 2025
కుల్గాంలో భీకర ఎన్‌కౌంటర్.. TRF కమాండర్ ట్రాప్

జమ్మూ కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలోని టంగ్‌మార్గ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పహల్‌గామ్ దాడికి కారణమైన TRF ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీని ట్రాప్ చేశారు. టెర్రరిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News August 9, 2025
రాఖీ కట్టని కవిత, షర్మిల

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక నేతలుగా ఉన్న కవిత, షర్మిల తమ సోదరులకు ఈ ఏడాది రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా తమ అనుబంధాన్ని చాటే కేటీఆర్-కవిత ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ వైరంతో దూరం పెరిగింది. దీంతో గతేడాది మాదిరే ఇవాళ కూడా జగన్‌కు షర్మిల రాఖీ కట్టలేదు.
News August 9, 2025
ఒక్క విమానమూ కూలలేదు: పాక్ రక్షణ మంత్రి

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చెందిన 6 విమానాలను <<17350664>>కూల్చేశామని<<>> IAF చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు. ‘ఒక్క పాక్ విమానాన్నీ ఇండియా కూల్చలేదు. 3 నెలల నుంచి వారేం మాట్లాడలేదు. కానీ మేము ఇంటర్నేషనల్ మీడియాకు అన్నీ వివరించాం. ఒకవేళ నమ్మకం లేకుంటే దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. అయినా భారత్ నిజాన్ని బయటకి రానివ్వదు’ అని వ్యాఖ్యానించారు.
News August 9, 2025
ట్రంప్, పుతిన్ భేటీ.. స్వాగతించిన భారత్

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘US, రష్యన్ ఫెడరేషన్ అలాస్కాలో సమావేశమయ్యేందుకు ముందుకు రావడాన్ని ఇండియా స్వాగతిస్తోంది. ఈ భేటీతో యుద్ధానికి తెరపడి ఉక్రెయిన్‌లో శాంతికి దారులు తెరుచుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని PM మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.