News August 27, 2024
ఎయిర్టెల్ Wynk మ్యూజిక్‌కు స్వస్తి!

తమ మ్యూజిక్ సర్వీస్ ‘Wynk మ్యూజిక్’ను ఎయిర్టెల్ కంపెనీ మూసివేసేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు పదేళ్ల పాటు సేవలు అందించిన ఈ సర్వీస్‌కు స్వస్తి చెప్పనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు మనీ కంట్రోల్ వెల్లడించింది. ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్థానంలో యూజర్లు యాపిల్ మ్యూజిక్ ఆస్వాదించవచ్చని తెలిపింది. Apple Incతో టై అప్ ప్రకటన తర్వాత మరిన్ని ఆఫర్లను తీసుకురానున్నట్లు పేర్కొంది.
Similar News
News February 6, 2026
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.
News February 6, 2026
30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.
News February 6, 2026
స్మృతి మంధాన ‘రాయల్’ విజయం!

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు కుంగిపోకుండా, పట్టుదలతో పోరాడి RCBని మరోసారి విజేతగా నిలిపారు స్మృతి మంధాన. మానసిక వేదనను పక్కన పెట్టి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకోవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. పడిలేచిన కెరటంలా పుంజుకున్న ఆమె ప్రయాణం.. నిరాశలో కూరుకుపోతున్న ఎందరికో ఆదర్శం. ఈ విజయం కప్పు మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి అభిషేకం.. మనోనిబ్బరానికి మరో మజిలీ.!


