News October 1, 2024

ముగిసిన నైరుతి.. మునిగిన రాష్ట్రాలు

image

నైరుతి రుతుపవనాల 4 నెలల సీజన్ నిన్నటితో ముగిసింది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 868.8MMకుగాను 934.8MM(8శాతం అధికం) నమోదైంది. కేరళ, AP, TG, అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, బిహార్, యూపీ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సీజన్‌లో ఏకంగా 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. APలో సాధారణం కంటే 18.6 శాతం అధిక వానలు కురిసినా 42 మండలాల్లో వర్షాభావం నెలకొనడం గమనార్హం.

Similar News

News October 16, 2025

పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

image

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్‌-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.

News October 16, 2025

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/

News October 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 37

image

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు ఎవర్ని సంహరించాడు?
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు ఎవరు?
3. వాయుదేవుడి వాహనం ఏది?
4. విష్ణువు ఏ అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు?
5. నవతి అంటే ఎంత?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>