News October 13, 2024
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు.. విశేషాలు

తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.


