News November 20, 2024
వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తా: జాన్సన్
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తానని ఆ జట్టు మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ తెలిపారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో వీరిద్దరూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే పాత వివాదానికి ఫుల్ స్టాప్ పెడతానని జాన్సన్ అన్నారు. వార్నర్‌కు ఆస్ట్రేలియా బోర్డు ఫేర్వెల్ టెస్ట్ కేటాయించినప్పుడు.. బాల్ ట్యాంపరింగ్ నిందితుడికి ఇలాంటివెందుకంటూ జాన్సన్ మండిపడ్డారు.
Similar News
News November 20, 2024
ఈ చేపలు తింటే అయోమయానికి లోనవుతారు!
చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే, కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. అందులో మధ్యదరా సముద్రంలో దొరికే సలేమా పోర్జీ చేప ఒకటి. ఒకవేళ ఈ చేపను తింటే ఆశ్చర్యకరమైన దుష్ప్రభావం చూపుతుంది. దీనిని తిన్న వ్యక్తి 36 గంటల పాటు అయోమయానికి లోనవుతారు. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. రోమన్ సామ్రాజ్యంలో వినోద ప్రయోజనాల కోసం దీనిని తినేవారు.
News November 20, 2024
ఐటీడీపీ నుంచే మా అమ్మ, చెల్లిని తిట్టించారు: జగన్
AP: తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘CBN నన్ను బోసిడీకే అని తిట్టించాడు. జూబ్లీహిల్స్ 36లోని బాలకృష్ణ బిల్డింగ్ నుంచే షర్మిలపై తప్పుడు రాతలు రాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వర్రా రవీంద్ర పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ చేత మా అమ్మ, చెల్లిని తిట్టించారు. ఫిబ్రవరిలోనే అతడిని అరెస్టు చేశాం’ అని గుర్తు చేశారు.
News November 20, 2024
ఝార్ఖండ్‌లో ముగిసిన పోలింగ్.. కాసేపట్లో WAY2NEWSలో ఎగ్జిట్ పోల్స్
ఝార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWS యాప్‌లో చూడండి.