News August 3, 2024

అంతులేని విషాదం.. 358 మంది మృతి

image

కేరళలోని వయనాడ్‌‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 358 మృతదేహాలను వెలికితీశారు. మరో 200 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. వారంతా కొండచరియల శిథిలాల కిందే ఉన్నట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఐదో రోజు కొనసాగుతుండగా బాధితులను గుర్తించేందుకు రాడార్లను వినియోగిస్తున్నారు. ఆర్మీ, NDRF, SDRFతో పాటు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Similar News

News March 3, 2026

గుంటూరు జిల్లాలో 14 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

గుంటూరు జిల్లా స్త్రీ&శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News March 3, 2026

అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

image

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 3, 2026

ఆయిల్ మాత్రమే కాదు నష్టం అంతకు మించి!

image

ఇరాన్‌పై దాడులతో భారత్‌కు ఆయిల్‌కు మించిన ముప్పు పొంచి ఉంది. UAEకి జరిగే ₹2లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, గల్ఫ్‌లోని 90 లక్షల మంది భారతీయులు స్వదేశానికి పంపే డబ్బులు ప్రమాదంలో పడతాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 100కి చేరే ఛాన్స్ ఉంది. ఖతర్ నుంచి LNG ఆగితే $19 బిలియన్ల ఎరువుల సబ్సిడీ భారమవుతుంది. పెరిగిన బంగారం ధరల వల్ల ప్రభుత్వ గోల్డ్ బాండ్ల నిల్వపై ₹2.1 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.