News September 19, 2024
కొత్త బుల్లెట్ వేరియెంట్ తీసుకొచ్చిన ఎన్ఫీల్డ్

బెటాలియన్ బ్లాక్ పేరిట రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లో కొత్త వేరియెంట్‌ను తీసుకొచ్చింది. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 153 ఎంఎం డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది. ధర రూ.1.75 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూమ్).
Similar News
News December 3, 2025
వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్‌డీల్‌పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.
News December 3, 2025
చదరంగంలో సంచలనం సృష్టించిన బుడ్డోడు

MP సాగర్ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు. స్మార్ట్‌ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్ నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్ (3సం.8నెలలు) పేరిట ఉండేది.
News December 3, 2025
పీఎం మోదీని కలిసిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.


