News March 18, 2024
సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వీఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు, అతిథి మర్యాదలు ఉండవు. ఎంతటి వారైనా సాధారణ భక్తులు లాగే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే సిఫార్సు లేఖలూ చెల్లవని స్పష్టం చేశారు.
Similar News
News February 10, 2026
గుర్లలో బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

గుర్ల మండలం పాలవలసలో ప్రత్యేక బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులచేత డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ మింగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరి ప్రమీల, DMHO డాక్టర్ ఎస్.జీవనరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

VZM: పాము కాటుతో వ్యక్తి మృతి

సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాటిపేటకి చెందిన రైతు సిరి ఆనందరావు (50) పాము కాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియజేయగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.