News March 16, 2024

ఎన్నికల నియమావళి అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించడం జరుగుతుందన్నారు.

Similar News

News January 31, 2026

కర్నూలులో 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ఫిబ్రవరి 2న ఉ.9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News January 31, 2026

దాడిలో గాయపడిన రమేశ్ మాదిగ మృతి

image

తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రమేశ్ మాదిగ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News January 31, 2026

బాలికల పాఠశాలల్లో 100% టాయిలెట్ సదుపాయం: కలెక్టర్

image

ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో ఉన్న చిప్పగిరి, మద్దికెర, హోళగుంద మండలాల బాలికల పాఠశాలల్లో మార్చి 15 నాటికి 100 శాతం టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హోళగుంద ZP హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అదనంగా 30 టాయిలెట్లు తక్షణమే నిర్మించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీరు, పోషకాహారం వంటి వసతులు నిర్మించాలన్నారు.