News March 22, 2026
ENG కోచ్ మెక్‌కల్లమ్‌పై సంచలన ఆరోపణలు

ENG కోచ్ మెక్‌కల్లమ్ మద్యం, పొగ తాగే ప్లేయర్లకే ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. యాషెస్ సిరీస్ మధ్యలో 6 రోజులు ప్లేయర్లు మద్యం తాగినట్లు ఆరోపణలున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్లే టీమ్ ఓడినట్లు కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడినట్లు సమాచారం. ECB మీటింగ్‌లో స్టోక్స్, మెక్‌కల్లమ్ ఒకరినొకరు నిందించుకున్నట్లూ వార్తలొస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను మెక్‌కల్లమ్ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.
Similar News
News April 12, 2026
సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)
News April 12, 2026
బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్.. ఆయుష్‌కు సిల్వర్

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్(BAC) మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా భారత షట్లర్ ఆయుష్ శెట్టి నిలిచారు. చైనా ఆటగాడు షియుక్వితో జరిగిన ఫైనల్‌లో ఆయన 8-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయుష్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. BAC మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ ఫైనల్ చేరడం 61ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1, 4, 7, 20 స్థానాల్లో ఉన్న వారిని ఓడించి ఆయుష్ ఫైనల్ చేరారు.