News August 9, 2024
ఎంగేజ్మెంట్ చేసుకున్న భారత క్రికెటర్

టీమ్ఇండియా క్రికెటర్ జితేశ్ శర్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. శలక మాకేశ్వర్తో ఆయన నిశ్చితార్థం నిన్న జరిగింది. కాసేపటి క్రితం ఈ విషయాన్ని జితేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అతను, 2023 ఆసియా క్రీడల సందర్భంగా IND తరఫున అరంగేట్రం చేశారు.
Similar News
News January 8, 2026
భూమిని కాపాడేందుకు ఈ చిన్న పని చేద్దాం!

మనలోని చిన్నమార్పు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వయంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం ద్వారా లక్షల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను అరికట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయిస్తే అందులో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. మిగిలినవి సముద్రాలను, భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్టీల్ లేదా మళ్లీ వాడగలిగే బాటిళ్లనే క్యారీ చేయండి. SHARE IT
News January 8, 2026
CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని: జగన్

AP: రాజధాని అమరావతిని రివర్ బేసిన్లో నిర్మిస్తున్నారని జగన్ అన్నారు. ‘అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలి. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా? అమరావతిలో రాజధాని కట్టకూడదు. గుంటూరు-విజయవాడ మధ్య కడితే బాగుంటుంది. అసలు రాజధానే లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని’ అని మీడియాతో పేర్కొన్నారు.
News January 8, 2026
వెనిజులా ఆయిల్ ఎగుమతులను మేమే కంట్రోల్ చేస్తాం: అమెరికా

వెనిజులా క్రూడాయిల్ ఎగుమతులను తామే నియంత్రిస్తామని అమెరికా తెలిపింది. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయాన్ని US అకౌంట్లలోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ పేర్కొన్నారు. ముందుగా స్టోరేజ్‌లో ఉన్న ఆయిల్‌ను విక్రయిస్తామని చెప్పారు. 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను తమకు వెనిజులా అందజేస్తుందని నిన్న ట్రంప్ ప్రకటించారు. కాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మదురోను US <<18751661>>అరెస్టు<<>> చేయడం తెలిసిందే.


