News April 19, 2024

స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

image

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్డ్‌నర్ తన స్నేహితురాలు మోనికా రైట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను యాష్లే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2017 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. యాష్లే ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.

Similar News

News November 27, 2025

జగిత్యాల: ఎయిడ్స్ డే ప్రోగ్రామ్స్‌కు ప్రత్యేక ప్రణాళిక

image

డిసెంబర్ 1న నిర్వహించనున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై బుధవారం జగిత్యాల డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్‌ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు పీహెచ్సీలు, సబ్‌సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

News November 27, 2025

మైఖేల్‌ వాన్‌కు వసీం జాఫర్ కౌంటర్

image

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. SAతో టెస్టు సిరీస్‌‌ను భారత్ కోల్పోవడంపై “డోంట్ వర్రీ వసీం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు”అని వాన్ అన్నారు. దీనిపై స్పందించిన జాఫర్..”నా బాధ త్వరలో తీరిపోతుంది. కానీ నువ్వు మరో 4 టెస్టులు భరించాలి”అని యాషెస్ సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

News November 26, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

image

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.