News August 13, 2024
చైతూతో ఎంగేజ్‌మెంట్.. శోభిత అరుదైన ఘనత
నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. దీంతో ఆమె ఈ వారం IMDb ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ముంజ్యా, మహారాజ్ సినిమాలతో క్రేజ్ సాధించిన బాలీవుడ్ నటి శార్వరీ అగ్రస్థానంలో నిలిచారు. 3, 4, 5 స్థానాల్లో షారుఖ్, కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు.
Similar News
News February 7, 2025
CT: పాకిస్థాన్ జెర్సీ ఆవిష్కరణ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు హోస్ట్ పాకిస్థాన్ తన జెర్సీ ఆవిష్కరించింది. గత జెర్సీకి భిన్నంగా దీనిని రూపొందించారు. కాగా ఇవాళ లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని PCB పున:ప్రారంభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ మైదానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. కొత్త ఫ్లడ్‌లైట్లు, సీట్లు, ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డులు, ఎల్ఈడీ టవర్లు, వీవీఐపీ బాక్సులు వంటివి నిర్మించారు. కాగా పాక్ ఆటగాళ్ల జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 7, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
News February 7, 2025
ఐదేళ్ల క్రితం రూ.8.7 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.2.4 కోట్లు!
స్టాక్ మార్కెట్‌లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్‌లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్‌లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.