News August 8, 2024
చైతూతో ఎంగేజ్మెంట్? శోభిత ఎవరో తెలుసా?

నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఇవాళ జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి. శోభిత ఏపీలోని తెనాలిలో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా ముంబైకి షిఫ్ట్ అయ్యారు. భరతనాట్యం, కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకున్నారు. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఫెమినా మిస్ ఇండియా-2013 టైటిల్ గెలుచుకున్నారు. గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్‌తో పాటు మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలోనూ నటించారు.
Similar News
News January 11, 2026
APPLY NOW: NABARDలో 44 పోస్టులు

<
News January 11, 2026
‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమా భారత్‌లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


