News August 8, 2024
సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో ఎంగేజ్మెంట్?

సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఏమాయ చేశావే’ రిలీజయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇదేరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించారు. కేవలం ‘మజిలి’ సినిమా ఫొటోలే ఉన్నాయి.
Similar News
News January 31, 2026
కోళ్లలో ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు

కోళ్ల పెంపకంలో అతి ప్రధాన సమస్య వ్యాధులు రావడం. వీటిని సకాలంలో గుర్తించి, నివారించకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోళ్లలో అతి ప్రమాదకరమైనది కొక్కెర వ్యాధి. దీంతోపాటు కొరైజా, అమ్మోరు/మశూచి, పుల్లొరం, తెల్లపారుడు వ్యాధులు పెంపకందారులకు, ఫౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని కోళ్లలో ఎలా గుర్తించాలి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 31, 2026
రాజధానిలోని ఆ మైనర్లకు పెన్షన్లు!

AP: రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.5వేలు పెన్షన్ అందిస్తోంది. ఏదైనా కారణంతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన పిల్లల్లో మైనర్లు ఉంటే వారికీ ఆర్థిక సాయం చేయాలని ఇటీవల క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇలా మైనర్లకు పెన్షన్లు అందజేయడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా పిల్లలకు పెన్షన్లు అందించే అధికారాన్ని CRDAకు అప్పగించింది.
News January 31, 2026
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేశారా?

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(<


